మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు మహబూబాబాద్ మండలం ఆమనగల్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. మహబూబాబాద్ రూరల్ సీఐ వెంకటరత్నం ఆధ్వర్యంలో సుమారు 100 మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొని.. సరైన అనుమతి పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు, రూ. లక్ష విలువైన మద్యం సీసాలు, 10 లీటర్ల గుడుంబా, 10 కేజీల పటిక, 30 లీటర్ల పెట్రోల్, 2 క్వింటాళ్ల నల్ల బెల్లం స్వాధీనం చేసుకున్నారు.
'యువత చెడు మార్గంలో పయనించకుండా ఉండేందుకే నిర్బంధ తనిఖీలు'
మహబూబాబాద్ జిల్లా ఆమనగల్లో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని పలు వాహనాలు, అక్రమ మద్యం సీసాలు, గుడుంబా స్వాధీనం చేసుకున్నారు.
'యువత చెడు మార్గంలో పయనించకుండా ఉండేందుకే నిర్బంధ తనిఖీలు'
గ్రామీణ యువత చెడు మార్గంలో పయనించకుండా, వ్యసనాలకు బానిస కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సీఐ వెంకటరత్నం పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను గమనించాలని సూచించారు. కిరాణా దుకాణాల్లో మద్యం అమ్మకాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.