తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

లైవ్ వీడియో: కారు బ్రేకులు ఫెయిల్​.. 4 వాహనాలు ధ్వంసం - రోడ్డు ప్రమాదంలో దగ్ధమైన బైకు చౌటుప్పల్​

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బ్రిజా కారు బ్రేకులు ఫెయిల్​ అవడం వల్ల నాలుగు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. అయితే మార్గమధ్యలో ఒకరు చనిపోయారు. కారు ఢీకొనడం వల్ల ఒక స్కూటీ పెట్రోల్ లీక్ అయి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే స్కూటీ దగ్ధమైంది.

car
car

By

Published : Oct 12, 2020, 2:04 PM IST

Updated : Oct 12, 2020, 3:37 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రిజా కారు బ్రేక్​లు ఫెయిల్ అయి.. 4 వాహనాలను ఢీకొట్టింది. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. చికిత్స కోసం తరిలిస్తుండగా మార్గమధ్యలో ఒకరు చనిపోయారు. క్షతగాత్రుల్లో ఒక చిన్నారి కూడా ఉంది.

కారు ఢీకొనడం వల్ల ఒక స్కూటీ పెట్రోల్ లీక్ అయి మంటలు చెలరేగాయి. చూస్తుండగానే స్కూటీ దగ్ధమైంది. క్షతగాత్రులు రంగారెడ్డి జిల్లా మాన్యగూడెంకు చెందినట్లుగా గుర్తించారు.

రెండు వాహనాలను ఢీకొట్టిన కారు.. స్కూటీలో చెలరేగిన మంటలు

ఇదీ చదవండి:బైక్​, ఆటోను ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

Last Updated : Oct 12, 2020, 3:37 PM IST

ABOUT THE AUTHOR

...view details