తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఓఆర్​ఆర్​పై కారు బీభత్సం... తల్లీకూతుళ్ల దుర్మరణం - రోడ్డు ప్రమాద వార్తలు

హైదరాబాద్​ ఔటర్​రింగ్​రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓ కారు ఢీకొనగా... 11 నెలల చిన్నారితో పాటు తల్లి కూడా మృతి చెందిన విషాదకర ఘటన చోటుచేసుకుంది.

car accident at koheda on hyderabad outer ring road
car accident at koheda on hyderabad outer ring road

By

Published : Nov 22, 2020, 10:32 AM IST

Updated : Nov 22, 2020, 11:40 AM IST

హైదరాబాద్​లోని ఓఆర్​ఆర్​పై కోహెడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తల్లీకూతురు మృతి చెందారు. ఔటర్​ రింగ్​ రోడ్డు​పై ముందు వెళ్తున్న వాహనాన్ని అతివేగంతో వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో 11 నెలల కుమార్తెతో పాటు తల్లి మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను మృతులు కర్ణాటకకు చెందిన త్రివేణి, చిన్నారి త్రివిక్షగా గుర్తించారు. బెంగుళూరుకు చెందిన నర్సింహ్మమూర్తి తన కూతురి తలనీలాలు సమర్పించాడానికి కుటుంభసభ్యులతో కలిసి యాదాద్రి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 873 కరోనా కేసులు, నలుగురు మృతి

Last Updated : Nov 22, 2020, 11:40 AM IST

ABOUT THE AUTHOR

...view details