తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కిడ్నాప్ చేశారా? అదృశ్యమయ్యారా? - missing news

నమాజ్ చేసుకునేందుకు మజీద్​కు వెళ్తున్నమని చెప్పి ఇంట్లోనుంచి వెళ్లిన చిన్నారులు అదృశ్యమైన ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

brothers-missing-in-veldurthi-mandal-in-medak-district
కిడ్నాప్ చేశారా? అదృశ్యమయ్యారా?

By

Published : Nov 19, 2020, 9:46 AM IST

మెదక్ జిల్లాలో ఇద్దరు చిన్నారులు కనిపించకుండా పోవడం స్థానికంగా కలకలం రేపింది. వెల్దుర్తి మండలం మూసాయిపేట గ్రామానికి చెందిన రియాన్(9), అర్మాన్(8) అన్నదమ్ములు. ఇరువురు మధ్యాహ్నం నమాజ్​ చేసేందుకు మజీద్​కు వెళ్లారు. అనంతరం వారు తిరిగి ఇంటికి రాలేదు.

తల్లిదండ్రులు బంధువులు, మిత్రుల ఇళ్ల వద్ద వెతికినా చిన్నారుల జాడ దొరకలేదు. అపహరణకు గురయ్యారన్న అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న చేగుంట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి:బాలుడి కిడ్నాప్ డ్రామా... విస్తుపోయిన పోలీసులు!

ABOUT THE AUTHOR

...view details