తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

'అధికారుల నిర్లక్ష్యమే బాలుడి ప్రాణం తీసింది' - హైదరాబాద్​లో నేర వార్తలు

మేడ్చల్ జిల్లా నేరేడ్​మెట్​లో విషాదం చోటుచేసుకుంది. శ్రీ సాయినగర్​ కాలనీలో గాలిపటం ఎగరవేస్తుండగా విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతితో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Boy Died due to Current Shock, At Neredmet in Medchal district
'అధికారుల నిర్లక్ష్యమే బాలుడి ప్రాణం తీసింది'

By

Published : Sep 12, 2020, 9:46 PM IST

మేడ్చల్ జిల్లా నేరేడ్​మేట్​లో విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందాడు. గాలిపటం ఎగరవేస్తుండగా కరెంట్ వైర్లకు పతంగి చిక్కుకోవడం వల్ల దానిని అందుకునే ప్రయత్నంలో కరెంట్ షాక్ కొట్టి బాలుడు చనిపోయాడు.

ఇంటికి అనుకొని చేతికి అందేంత దూరంలో కరెంట్ వైర్లు ఉండటంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపించారు. గతంలో కరెంటు వైర్ల విషయంలో పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని తెలిపారు.

ఇవీచూడండి:రవీంద్రభారతి వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన నాగులు మృతి

ABOUT THE AUTHOR

...view details