పెద్దపల్లి నుంచి కాటారం వైపు మంథని మీదుగా నల్లబెల్లాన్ని తరలిస్తున్నారన్న సమాచారం మేరకు మంథని ఎక్సైజ్ పోలీసులు చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీ చేపట్టారు. ఆసమయంలో ఓ ట్రాలీ వ్యాన్ అనుమానాస్పదంగా కనపించడం వల్ల దానిని సోదా చేశారు. ట్రాలీ కింద భాగంలో 8 డబ్బాల్లోని సుమారు 160 కిలోల బెల్లాన్ని పట్టుకున్నారు.
కిరాణ సరకుల మాటున.. 160 కిలోల నల్లబెల్లం అక్రమ రవాణా
అక్రమంగా తరలిస్తున్న 160 కిలోల నల్ల బెల్లాన్ని మంథని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఒక ట్రాలీవ్యాన్ను సీజ్ చేసి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
కిరాణా సరకుల మాటున.. 160 కేజీల నల్లబెల్లం అక్రమ రవాణా
ట్రాలీ వ్యాన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం పెద్దతూండ్ల గ్రామానికి చెందిన సంతోష్ అనే వ్యక్తికి చెందినదిగా గుర్తించారు. అతను అక్రమంగా బెల్లాన్ని సరఫరా చేస్తూ, గుడుంబా తయారు చేసే వారికి విక్రయిస్తాడని మంథని ఎక్సైజ్ సీఐ గురువయ్య తెలిపారు. 160 కిలోల బెల్లాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి:మద్యం సీసా సీల్ తీయకుండానే కల్తీ