జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ వద్ద జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. శనివారం తెల్లవారుజామున జాతీయ రహదారి డివైడర్ మధ్యలో ఉన్న హైమాస్ట్ లైట్ స్తంభాలు-37 విరిగి కింద పడ్డాయి. అదే సమయంలో కరీంనగర్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్.. అప్రమత్తమై బస్సు ఆపి ప్రయాణికులను దింపివేశాడు.
విరిగిన హైమాస్ట్ లైట్ స్తంభాలు.. తప్పిన పెను ప్రమాదం - big accident is missed in metpally
జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ వద్ద జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. డివైడర్ మధ్యలో ఉన్న హైమాస్ట్ లైట్ స్తంభాలు విరిగి కింద పడ్డాయి. అదే సమయంలో అటు నుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్.. చాకచక్యంతో బస్సు ఆపడం వల్ల ప్రమాదం తప్పి.. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
విరిగిన హైమాస్ట్ లైట్ స్తంభాలు
రోడ్డుకు అడ్డంగా స్తంభాలు పడటం వల్ల కొంతసేపు ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న పురపాలక అధికారులు.. సంఘటనాస్థలికి చేరుకుని స్తంభాలు తొలగించారు. ఈ ఘటనలో ఎవరికి ఏం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తుప్పు పట్టడం వల్లే స్తంభాలు విరిగి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. వారి నిర్లక్ష్యమే ఈ ఘటనకు దారితీసిందని పలువురు ఆరోపిస్తున్నారు.