లంచం తీసుకుంటూ... నిజామాబాద్ జిల్లా బోధన్ టౌన్ సీఐ పల్లె రాకేష్ ఏసీబీకి పట్టుబడ్డాడు. భూ తగాదా విషయంలో సాజిద్ అనే వ్యక్తి వద్ద నుంచి రూ. 50 వేల నగదు, లక్ష రూపాయల విలువైన మొబైల్ లంచం తీసుకుంటుండగా... ఏసీబీ అధికారులకు పట్టుకున్నారు. సీఐకి సహకరించిన ఎస్సై మొగులయ్య, కానిస్టేబుల్ గజేందర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏసీబీ డీఎస్పీ రవి కుమార్ తెలిపారు.
భూ వివాదం పరిష్కారానికి లంచం డిమాండ్.. అనిశాకు చిక్కిన సీఐ - అనిశాకు చిక్కిన బోధన్ సీఐ పల్లె రాకేష్
లంచం తీసుకుంటుండగా నిజామాబాద్ జిల్లా బోదన్ పట్టణ సీఐ, ఎస్సై, ఓ కానిస్టేబుల్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ భూ వివాదం కేసులో లంచం డిమాండ్ చేయగా... బాధితుడు అనిశా అధికారులను ఆశ్రయించాడు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పట్టణంలోని రెంజల్ బేస్ ప్రాంతానికి చెందిన సాజిద్ అనే వ్యక్తికి, సుదర్శన్ గౌడ్‌కి మధ్య భూ వివాదం చోటుచేసుకుంది. సాజిద్‌పై సుదర్శన్ గౌడ్ కేసు పెట్టాడు. సాజిద్ బులెట్ బైక్ పీఎస్‌కి తీసుకు వచ్చి ఇబ్బందులు పెడుతున్నారని, కేసు విషయంలో సాజిద్‌కి సహకరించేందుకు... రూ.50 వేల నగదు, రూ. లక్ష విలువైన మొబైల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో సాజిద్ అనిశా అధికారులను ఆశ్రయించాడు. లంచం తీసుకుంటుండగా... రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి:పేకాట స్థావరంపై ఎస్‌వోటీ పోలీసుల దాడులు