హైదరాబాద్లోని దుండిగల్ పీఎస్ పరిధి సురారం రాజీవ్ గృహకల్పలో ఓ వ్యక్తి తాగిన మైకంలో ఇద్దరు చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడగా స్థానికులు దేహశుద్ధి చేశారు. గతంలో చిన్నారుల పట్టీలు ఎత్తుకెళ్ళి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి లైంగిక దాడికి యత్నించాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారని బస్తీ వాసులు తెలిపారు.
'చిన్నారులపై లైంగికదాడికి యత్నం.. చితక్కొట్టిన స్థానికులు' - hyderabad
తాగిన మైకంలో ఓ కామాంధుడు ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. అది గమనించిన స్థానికులు అతనికి దేహశుద్ధి చేసిన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది.
కామాంధులను కఠినంగా శిక్షించాలి
వేసవికాలం సెలవుల్లో పిల్లలందరూ ఇళ్ల వద్ద ఆడుకుంటుంటారు. పెద్దలు పనులకు వెళ్తారు కనుక ఇలాంటి వాళ్ళతో ఉండడం మంచిది కాదని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. కామాంధులను కఠినంగా శిక్షించి పోలీస్ వ్యవస్థను మరింత పటిష్ఠ పరచాలని కోరారు.
ఇవీ చూడండి: స్థానిక సమరంలో అభ్యర్థుల లెక్క తేలింది
Last Updated : May 10, 2019, 8:23 AM IST