తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పెళ్లి సంబంధం చెడగొట్టాడని వ్యక్తిపై గొడ్డలితో యువకుడి దాడి - గొడ్డిలితో యువకుడి దాడి వార్తలు కామారెడ్డి

పెళ్లి సంబంధం చెడగొట్టాడని వ్యక్తిపై గొడ్డలితో యువకుడి దాడి
పెళ్లి సంబంధం చెడగొట్టాడని వ్యక్తిపై గొడ్డలితో యువకుడి దాడి

By

Published : Oct 30, 2020, 7:54 PM IST

Updated : Oct 30, 2020, 8:53 PM IST

19:45 October 30

పెళ్లి సంబంధం చెడగొట్టాడని వ్యక్తిపై గొడ్డలితో యువకుడి దాడి

కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి చెడిపోయిందన్న యువకుడి బాధ ఒకరి ప్రాణాలు తీసేవరకు వెళ్లింది. తన పెళ్లి సంబంధం చెడగొట్టాడన్న కక్షతో పరుశురాం అనే వ్యక్తిపై ఓ యువకుడు గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన పరుశురాం పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ఆస్పత్రికి తరలించారు.  

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఎదుట గోసంగి కాలనీకి చెందిన కోదండం పరుశురాంపై ఆర్​బీ నగర్​కు చెందిన అల్లం శివ గొడ్డలితో దాడి చేశాడు. పెళ్లి సంబంధం విషయంలో శివ ప్రవర్తన గురించి యువతి కుటుంబ సభ్యులకు పరుశురాం చెడుగా చెప్పాడని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అల్లం శివ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  

ఇదీ చదవండి:షేర్‌చాట్‌లో స్కిట్‌ కోసం బాలుణ్ని బలిచేసిన బిహార్‌​ వాసి

Last Updated : Oct 30, 2020, 8:53 PM IST

ABOUT THE AUTHOR

...view details