ఏపీ ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి చనిపోయిన కేసులో ఆంధ్ర పోలీసులు హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. సంస్థ యజమాని శ్రీనివాస్‌రావుతో పాటు మరో ముగ్గురిని రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు... ప్రకాశం జిల్లా తరలించారు. జీడిమెట్ల పోలీసులు మాత్రం ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.
అక్కడా కొంతమందికి సరఫరా...
జీడీమెట్లలోని పర్ఫెక్ట్ కెమికల్స్ అండ్ సాల్వెంట్ దుకాణంలో శానిటైజర్ తయారీకి కావాల్సిన రసాయనాలను కొని అనంతరం వాటిని ఏపీలోని కొంత మందికి సరఫరా చేశారు. అలా ప్రకాశం జిల్లా కురిచేడుకు శానిటైజర్లు చేరినట్లు సమాచారం. శానిటైజర్ తాగి చనిపోయిన వారిలో పలువురు పర్ఫెక్ట్ కంపెనీ తయారు చేసిన సరుకు వాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు ఏపీ పోలీసులు వెల్లడిస్తారని జీడిమెట్ల పోలీసులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి : భార్యకు కరోనా సోకిందని భర్త పరార్