తెలంగాణ

telangana

By

Published : Oct 1, 2020, 2:35 PM IST

ETV Bharat / jagte-raho

ఆ పిల్లలు నేరస్థులు కాదు.. బాధితులు: జస్టిస్ మహేశ్వరి

నేరం ఆరోపణలు ఎదుర్కొంటున్న పిల్లలు నేరస్థులు కారని, బాధితులని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి అన్నారు. పిల్లలు దేశ భవిష్యత్తుకు ముఖ్యమైన మూలధనమని.. వారి గురించి ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవాలని సూచించారు. పిల్లల భవిష్యత్తు విషయంలో అందరూ బాధ్యత కలిగి‌ ఉండాలని పేర్కొన్నారు. జువైనైల్ జస్టిస్ యాక్ట్ అమలు తీరుపై జరిగిన వెబినార్​లో ఆయన పాల్గొన్నారు.

hicourt-justice-jk-maheswari-in-juvinal-workshop
ఏపీ: ఆ పిల్లలు నేరస్థులు కాదు.. బాధితులు: జస్టిస్ మహేశ్వరి

జువైనైల్ జస్టిస్ యాక్ట్ అమలు తీరుపై సీఐడీ ఆధ్వర్యంలో జరిగిన వర్క్ షాపులో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనాథ పిల్లల దత్తతకు న్యాయపరమైన సమస్యలు ఉండటంతో కొంత ఆలస్యం అవుతోందని... వాటిని వేగంగా పూర్తి చేయాలని సూచించారు. పిల్లలు దేశ భవిష్యత్తుకు ముఖ్యమైన మూలధనమని.. వారి గురించి ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవాలన్నారు. అబ్దుల్ కలాం పిల్లల భవిష్యత్తు గురించి చెప్పారని.. సమాజంలో ప్రతిఒక్కరూ అనాథ పిల్లల భవితవ్యంపై దృష్టి సారించాలని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

జువైనైల్ జస్టిస్ ప్రకారం నేరం ఆరోపణలు ఎదుర్కొంటున్న చిన్నారులను పట్టించుకునే వారులేని పిల్లలుగా వర్గీకరించారని.. వీరి పట్ల అందరూ బాధ్యత కలిగి‌ ఉండాలని జస్టిస్​ మహేశ్వరి హితవు పలికారు. వారితో మృదువుగా ప్రవర్తించాలని, మానసిక స్ధితిగతులను అర్ధం చేసుకుని వారితో మెలగాలని కోరారు. ప్రభుత్వాలు ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీలు ఏర్పాటు చేసి పిల్లలకు రక్షణ కల్పించాలని సూచించారు. వృద్ధాశ్రమాల దగ్గరలో జువైనైల్ హోంలు ఉండాలని, లీగల్ క్లియరెన్స్ విషయంలో సీడబ్ల్యూసీల విధానాలలో ఇంకా మార్పులు రావాలని జస్టిస్ జే.కే.మహేశ్వరి తెలిపారు.

www.trackthemissingchild.gov.in వెబ్​సైట్​లో ప్రజలు ఎవరైనా అనాథ బాలురు, బాలికలు వివరాలు తెలియచేయవచ్చని ఆ రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ స్పష్టం చేశారు. ఒంటరి చిన్నారులను కొట్టడం, దుర్బాషలాడటం చేయకూడదన్నారు. పిల్లలపై నేరారోపణ విషయంలో పీఎస్​కు తీసుకువస్తే స్టేషన్​లో మృదువుగా వ్యవహరించాలని గౌతం సవాంగ్ సూచించారు.

ఇవీ చదవండి.. విజయవాడ దుర్గ గుడి పాలకమండలి సభ్యురాలు రాజీనామా

ABOUT THE AUTHOR

...view details