తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వీళ్లింతే మారరిక..: విద్యుత్ శాఖలో 'లంచా'ధికారులు

విద్యుత్ శాఖలో లంచం తీసుకుంటున్న ఇద్దరు ఏఈలు, ఓ లైన్ మెన్​ను అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. 55 వేలు లంచం డిమాండ్ చేయగా అనిశా అధికారులను సంప్రదించినట్లు బాధితుడు పేర్కొన్నాడు.

By

Published : Dec 28, 2020, 10:32 PM IST

Updated : Dec 29, 2020, 2:24 AM IST

anti-corruption-department-officials-caught-a-power-department-official-taking-a-bribe-in-adilabad-town
వీళ్లింతే మారరిక..: విద్యుత్ శాఖలో 'లంచా'ధికారులు

అదిలాబాద్ పట్టణంలో విద్యుత్ శాఖ అధికారులు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. వీరిలో ఇద్దరు ఏఈలు, ఓ లైన్ మెన్ ఉన్నారు. కరీంనగర్ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి.

పట్టణానికి చెందిన బండారి సంతోష్ అనే వ్యక్తి నుంచి లైన్మెన్ ప్రకాష్ 15వేల లంచం తీసుకుంటుడగా అనిశా అధికారులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ఏఈ లు శ్రీనివాస్, కృష్ణారావు పాత్ర ఉండటంతో వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వాటర్ ప్లాంట్ కోసం మీటర్ బిగింపు విషయంలో మొత్తం 55 వేలు లంచం డిమాండ్ చేయగా.. అనిశా అధికారులను సంప్రదించినట్లు బాధితుడు సంతోష్ పేర్కొన్నారు.


ఇదీ చూడండి:వైద్యుని కేసులో సీబీఐ దర్యాప్తుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

Last Updated : Dec 29, 2020, 2:24 AM IST

ABOUT THE AUTHOR

...view details