తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నెల రోజుల క్రితం పూడ్చిపెట్టిన మృతదేహానికి శవ పరీక్ష - rangareddy latest news

an-autopsy-on-a-body-buried-a-month-ago
నెల రోజుల క్రితం పూడ్చిపెట్టిన మృతదేహానికి శవ పరీక్ష

By

Published : Sep 27, 2020, 6:43 PM IST

Updated : Sep 27, 2020, 9:19 PM IST

18:40 September 27

నెల రోజుల క్రితం పూడ్చిపెట్టిన మృతదేహానికి శవ పరీక్ష

రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలంలోని గుండాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సాలె కిష్టయ్యను కన్న కొడుకు, కట్టుకున్న భార్య కలిసి హత్య చేసి.. పొలంలో పాతి పెట్టారు.

గత 45 రోజులుగా కిష్టయ్య కనిపించకపోవడం పట్ల అనుమానించిన కుటుంబ సభ్యులు.. ఈనెల 24న మృతుడి కొడుకు రమేష్​ను నిలదీయగా.. తల్లితో కలిసి పథకం ప్రకారం కిష్టయ్యను హత్య చేసి.. పొలంలో పాతిపెట్టినట్టు తెలిపాడు.

బంధువుల సమాచారం మేరకు 2 రోజుల క్రితమే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కిష్టయ్య రోజూ తాగొచ్చి గొడవలకు పాల్పడుతుండటం వల్ల పథకం ప్రకారమే హతమార్చినట్లు వివరించారు.

ఈ మేరకు  పొలం వద్ద పాతిపెట్టిన కిష్టయ్య మృతదేహానికి నేడు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఇదీచూడండి: తల్లి, కొడుకు కలిసి.. కన్నతండ్రిని కడతేర్చారు

Last Updated : Sep 27, 2020, 9:19 PM IST

ABOUT THE AUTHOR

...view details