ఏపీలో అమరావతి రాజధాని ఉద్యమం 220 రోజులకు పైగా సాగుతోంది. ఆశల రాజధాని కోసం భూములిచ్చిన రైతులు.. కొత్త రాజధాని ప్రతిపాదనతో తీరని శోకానికి గురయ్యారు. ఉద్యమంలో పాల్గొని ఇప్పటికే కొందరు అమరులయ్యారు. మూడు రాజధానుల ప్రతిపాదనకు గవర్నర్ రాజముద్ర వేసిన కొద్దిరోజుల్లోనే మరో రైతు ప్రాణాలొదిలాడు.
అమరావతి కోసం మరో రైతు మృతి
ఏపీ రాజధానిగా అమరావతి ఉండాలంటూ మరో రైతు బలయ్యాడు. నిన్నటి వరకూ ఉద్యమంలో పాల్గొన్న అన్నదాత గుండెపోటుతో నేలకొరిగాడు.
అమరావతికి కోసం మరోరైతు మృతి
నిన్నటి వరకూ ఉద్యమంలో పాల్గొన్న నీరుకొండకు చెందిన నన్నపనేని వెంకటేశ్వరరావు గుండెపోటుతో మృతి చెందాడు. అన్నదాత మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి:ఆ రాష్ట్ర గవర్నర్‌కు కరోనా పాజిటివ్