తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

'సైబర్' విహారం: తలలు పట్టుకుంటున్న పోలీసు యంత్రాంగం - kidnap news

నిందితులు నేరాలు చేసి పోలీసులకు దొరకకుండా ఉండేందుకు సాంకేతికతను విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. పెరిగిపోయిన సాంకేతికతను పునికిపుచ్చుకుంటున్న పోలీసులకు సైతం చిక్కకుండా ఉండేందుకు... రకరకాల కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు. చుట్టూ ఉంటూనే చిక్కకుండా పోలీసులకు తలనొప్పిగా మారుతున్నారు.

సాంకేతికతతో చెలరేగిపోతున్న నేరగాళ్లు... తలలు పట్టుకుంటున్న పోలీసులు
సాంకేతికతతో చెలరేగిపోతున్న నేరగాళ్లు... తలలు పట్టుకుంటున్న పోలీసులు

By

Published : Oct 22, 2020, 6:48 PM IST

నేరాలకు పాల్పడుతున్న నిందితులు కొత్త కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తూ పోలీసులకు దొరకకుండా జాగ్రత్తపడుతున్నారు. పోలీసులు ఎంత సాంకేతికత వినియోగించినా చిక్కకుండా నేరాలు చేస్తున్నారు. దీనికి ఉదాహరణే ఇటీవల జరిగిన మహబూబాబాద్​ కిడ్నాప్​ కేసు. పట్టాణానికి చెందిన బాలుడు కుసుమ దీక్షిత్‌ రెడ్డిని నిందితుడు డబ్బు కోసం కిడ్నాప్ చేసి అతి దారుణంగా చంపేశాడు.

బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితుడు వాడిన టెక్నాలజీ వల్ల 4 రోజుల వరకు పోలీసులకు దొరకలేదు. నిందితుడు సాంకేతికతను ఉపయోగించుకోవటం వల్ల 5 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్న కూడా పోలీసులు పట్టుకోలేకపోయారు. ఎవ్వరికీ చిక్కకుండా, తన జాడ తెలియకుండా ఉండేందుకు ఇంటర్నెట్‌ కాల్‌ చేసి బాధితుల నుంచి రూ.45 లక్షలను డిమాండ్​ చేశాడు. సాధారణంగా ఫోన్‌ కాల్‌ అయితే సిగ్నల్స్ ఆధారంగా... ఏ ప్రాంతంలో ఉన్నారనేది తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్‌ కాల్‌లో సిగ్నల్‌ పసిగట్టడానికి వీల్లేదని నిపుణులు చెబుతున్నారు.

వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్(వీఓఐపీ)గా ఈ కాల్​ను వ్యవహరిస్తారు. నెట్ కాల్ చేసే వారు దాన్ని స్వీకరించే వారికి సమీపంలో ఉన్నా... ఇతర దేశాల గుండా రూటింగ్ అవుతూ కాల్ స్వీకరించే వారికి చేరుతుంది. పైగా ఇంటర్నెట్ కాల్‌లో వర్చువల్ నంబర్లు వస్తాయి. కాల్ చేసిన ప్రతీసారి కొత్త నంబర్ రావడం వల్ల దాని ఐపీ ట్రాక్ చేయకుండా ఉంటుంది. మొబైల్ ఫోన్ నుంచే ఇంటర్నెట్ కాల్ చేసేందుకు రకరకాల అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. దీనికి సిమ్ నంబర్, ఐఎంఈ నంబర్లు ఉండవు. ఇంటర్నెట్ కాల్‌లో ఐపీలు ఏ దేశానివైనా పెట్టుకోవచ్చు. ఇలా సైబర్ నేరగాళ్లు, కిడ్నాప్ కేసుల్లో నిందితులు పోలీసులను అయోమయానికి గురి చేస్తున్నారు.

ఇదీ చూడండి: బాలుడి కిడ్నాప్ దృశ్యాలు.. ఇదిగో లైవ్ వీడియో..

ABOUT THE AUTHOR

...view details