తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కుమార్తె ఇంటి నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం - latest crimes in yadadri district

నర్సింహ, బాలలక్ష్మి భార్యాభర్తలు. వారి మనుమడుతోపాటు కుమార్తె ఇంటి నుంచి తిరిగి వస్తున్నారు. అంతలోనే ఊహించని కుదుపు వారి కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది. రాంపూర్ గ్రామం వద్ద రోడ్డు గుంతలుగా ఉండడం వల్ల ఒక్కసారిగా బ్రేక్ వేయగా.. బైక్​పై నుంచి బాలలక్ష్మి జారి కింద పడింది. వెనుక నుంచి వస్తున్న కంటైనర్ ఢీకొట్టింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

accident at rampur village in yadadri bhuvanagiri district and one person died
కుమార్తె ఇంటి నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం

By

Published : Dec 21, 2020, 6:57 AM IST

యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రాంపూర్ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొమ్మలరామరం మండలం మేడిపల్లికి చెందిన కసాబోణి నర్సింహ, బాలలక్ష్మి, వారి మనుమడు.. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని కుమార్తె ఇంటికి వెళ్లి వస్తుండగా విషాదం చోటుచేసుకుంది. రాంపూర్ వద్ద రోడ్డు గుంతలుగా ఉండడం వల్ల బ్రేక్ వేయగానే బైక్​పై నుంచి మహిళ జారి కింద పడింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న కంటైనర్ ఢీకొట్టడంతో బాలలక్ష్మి నుజ్జు నుజ్జు అయ్యింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

ఆమె భర్త నర్సింహ, వారి మనువడికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పక్క గ్రామం రుస్తాపూర్​లో లారీ డ్రైవర్​ తన వాహనాన్ని నిలిపి పరారయ్యాడు. ఘటనాస్థలికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: విద్యుత్​స్తంభంపై షాట్​సర్క్యూట్​... దుకాణానికి మంటలవ్యాప్తి

ABOUT THE AUTHOR

...view details