అనిశా వలలో మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ - acb
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ భూసంబంధిత దస్త్రాలపై సంతకాలకు లంచం డిమాండ్ చేసింది. బాధితుడు అవినీతి నిరోధక శాఖను సంప్రదించగా అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్నారు. చాంద్రాయణ గుట్టకు చెందిన రియల్టర్ మహమ్మద్ ఆర్షద్ హుస్సేన్ చెందిన దస్త్రాలపై సంతకాలు చేసేందుకు 35 వేలు లంచం ఇవ్వాల్సిందిగా మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ సంగీత డిమాండ్ చేశారు. ఆర్షద్ ఇదే విషయాన్ని అనిశా అధికారులకు తెలపడం జరిగింది. బుధవారం రామకృష్ణ అనే మధ్యవర్తికి 30 వేలు ముట్టజెప్పారు. ఇంకా ఐదువేలు ఇవ్వాలని అడగగా అనిశా అధికారులు పక్కా సమాచారంతో.. ఈరోజు గణేష్ అనే మరొకరికి ఇస్తుండగా పట్టుకున్నారు. అధికారులు లంచం అడిగితే అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించాలని హైదరాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కోరారు.