తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

జీహెచ్​ఎంసీ కార్యాలయంలో అనిశా సోదాలు

హైదరాబాద్​ ఉప్పల్​ నగరపాలక సంస్థ కార్యాలయంలో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో రెవెన్యూ విభాగంలో తనిఖీలు నిర్వహించారు.

సోదాలు చేస్తున్న అధికారులు

By

Published : Mar 17, 2019, 6:12 AM IST

Updated : Mar 17, 2019, 9:28 AM IST

సోదాలు చేస్తున్న అధికారులు
హైదరాబాద్‌ ఉప్పల్​ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. రెవెన్యూ విభాగంలో అక్రమాలు జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదుతోఅధికారులు రంగంలోకి దిగారు. ఈనెల 2నచంద్రశేఖర్‌ అనే వ్యక్తికి ఇంటి పన్ను విషయంలో రెవెన్యూ అధికారి వెంకటేశ్‌ రూ.40వేలు డిమాండ్‌ చేశాడు. అటెండర్‌ ఐలేష్‌, టాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్‌, ప్రైవేటు అసిస్టెంట్‌ నవీన్‌కు బాధితుడు సొమ్ము ఇచ్చాడు. ఈ ఘటనపై బాధితుడు అనిశా అధికారులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన అధికారులు ఐలేష్‌, నవీన్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఉన్నతాధికారుల పాత్రపై కూడా అనిశా దర్యాప్తు చేస్తోంది.
Last Updated : Mar 17, 2019, 9:28 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details