వికారాబాద్ జిల్లా తాండూరులో మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్ చేశాడు. చేతిలో కత్తి పట్టుకుని.. రహదారి పక్కన నిలబడిన వారిపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. పట్టణానికి చెందిన మూస అనే వ్యక్తి కొన్ని నెలలుగా మతిస్థిమితం లేకుండా వీధుల్లో తిరుగుతున్నాడు. ఇదే క్రమంలో పట్టణంలోని శివాజీ కూడలి ప్రాంతంలో గురువారం రాత్రి.. కూరగాయలు కోసే కత్తితో పాటు బ్లేడును చేతిలో పెట్టుకున్నాడు. ద్విచక్రవాహనం వద్ద నిలబడిన మహబూబ్, షఫీ అనే ఇద్దరు వ్యక్తులపై దాడి చేశాడు.
తాండూరులో మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్ - thandur news
వికారాబాద్ జిల్లా తాండూరులో మతిస్థిమితం లేని వ్యక్తి కలకలం సృష్టించాడు. రహదారి పక్కన నిలబడిన వారిపై కత్తితో దాడి చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు.
వికారాబాద్, తాండూరు, మతిస్థిమితం లేని వ్యక్తి
ఈ క్రమంలో మూసను.. స్థానికులతో కలిసి బాధితులు నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనలో అతను గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:వాట్సాప్లో స్టేటస్ పెట్టి యువకుడి బలవన్మరణం