తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పోలీసుల వేధింపులతో ఆత్మహత్య.. స్టేషన్​ ఎదుట ఆందోళన - వరంగల్​ రూరల్​ జిల్లాలో పోలీస్​ స్టేషన్​ ఎదుట ఆత్మహత్య

ఎక్సైజ్​ పోలీసుల వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్​ గ్రామీణ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ మేరకు మృతుడి కుటుంబ సభ్యులు పోలీస్​ స్టేషన్​ ఎదుట ఆందోళనకి దిగారు.

a person committed suicide at police station warangal rural district
పోలీసుల వేధింపులకి గురై ఆత్మహత్య.. స్టేషన్​ ఎదుట ఆందోళన

By

Published : Nov 4, 2020, 10:24 AM IST

ఎక్సైజ్ పోలీసుల వేధింపులు తాళలేక వరంగల్ గ్రామీణ జిల్లా చెన్నారావుపేట మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన రాజయ్య పోలీస్​స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యకి పాల్పడ్డాడు. లాక్​డౌన్ సమయంలో అక్రమంగా మద్యం అమ్ముతూ రాజయ్య పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ కేసు విషయమై తన సరకును ఇవ్వాలంటూ పోలీసులను వేడుకున్నా అతనిని కరుణించలేదు. ఈ క్రమంలో పోలీసులు వేధింపులకు గురి చేశారని మనస్తాపానికి గురైన రాజయ్య.. పోలీసు స్టేషన్ ఎదుట ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వేధింపులే కారణమంటూ మృతుడి కుటుంబ సభ్యులు మృతదేహంతో పోలీస్ స్టేషన్​ ఎదుట ధర్నాకు దిగారు.

ABOUT THE AUTHOR

...view details