ఏపీలోని విజయవాడలో కొత్త రకం దొంగతనాలకు పాల్పడుతున్నారు దొంగలు. కొత్త ద్విచక్రవాహనాలపై కన్నేసిన మోసగాళ్లు... మాయమాటలు చెప్పి బండ్లను దర్జాగా తీసుకెళ్తున్నారు. విజయవాడ సూర్యారావు పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడి కొత్త ద్విచక్ర వాహనాన్ని ఓ దొంగ మోసం చేసి తీసుకెళ్లాడు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. ఇటీవల కాలంలో నగరంలోని పలు ప్రాంతాల్లో వరుస చోరీలు జరుగుతున్నాయి. కొత్త వాహనం కనిపిస్తే చాలు ట్రయల్ పేరుతో తీసుకెళ్లి ఊడయిస్తున్నారు. గురువారం ఒక్కరోజే మూడు ద్విచక్రవాహనాలు చోరికి గురయ్యాయి.
తాడేపల్లికి చెందిన సాయిసూర్య అనే యువకుడు కెటీఎం ఆర్‌సీ 200 అనే మోడల్ బైక్‌తో డొమినోస్ ముందు ఆగాడు. అక్కడికి మరో వ్యక్తి కేటీఎం డ్యూక్ బైక్‌తో వచ్చాడు. సాయి సూర్య బైక్ బాగుందని పొగడ్తలతో ముంచెత్తాడు. ట్రయల్ చేసి ఇస్తానని నమ్మించి ద్విచక్రవాహనం తీసుకొని ఉడాయించాడు. ఎంతసేపటకి రాకపోవడంతో సూర్యారావుపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.