న్యాయం చేయాలని కోరుతూ.. భర్త ఇంటి ఎదుట ఓ వివాహిత దీక్ష చేస్తోంది. ఈ ఘటన ఆత్మకూర్ మండలం మొరిపిరాల గ్రామం చిన్నగూడెంలో చోటు చేసుకుంది.
మూడేళ్ల క్రితం..
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎం) మండలం మొరిపిరాల ఆవాస గ్రామమైన చిన్నగూడెంకు చెందిన.. యాస నవీన్ రెడ్డి, బెజ్జరబోయిన మౌనిక ప్రేమించుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో కుటుంబ పెద్దలు అడ్డుచెప్పారు.కానీ.. పెద్దలను ఎదిరించి 2017 అక్టోబర్లో శ్రీశైలం వెళ్లి కులాంతర వివాహం చేసుకున్నారు. వివాహనంతరం కొన్నాళ్లు అబ్బాయి వాళ్లింట్లో కాపురమున్నారు. అనంతరం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ జీవనం కొనసాగించారు.
ఏడాది నుంచి ..
రెండేళ్లు తనతో మంచిగా ఉన్న నవీన్ రెడ్డి ఏడాది నుంచి తరచూ కట్నం కావాలని వేధిస్తున్నాడని, అక్రమ సంభందాల పేరుతో హింసిస్తున్నాడని బాధితురాలు వాపోయింది. మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను విడిపించుకునేందకు చిత్ర హింసలు పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.
మూడు నెలల క్రితం ..