భూమిని కబ్జా చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారని ఓ వ్యక్తి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన కుమారస్వామి ప్రాణభయంతో పోలీసులను ఆశ్రయించాడు. ఓ రాజకీయ పార్టీకి చెందిన సాయిప్రసాద్, అతని కుమారుడు భూమిని దున్నుతుండగా తనపై దాడి చేశారని ఆరోపించారు.
ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి - నిజామాబాద్ జిల్లా నేర వార్తలు
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన కుమారస్వామి ప్రాణభయంతో పోలీసులను ఆశ్రయించాడు. ఓ రాజకీయ పార్టీకి చెందిన ఓ వ్యక్తి తనను చంపుతానని బెదిరిస్తున్నాడని లిఖితపూర్వకంగా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి
మదనపల్లి రహదారి పక్కనే ఉన్న భూమిని కబ్జా చేసి తనను చంపుతామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కులం పేరుతో దూషిస్తూ దుర్భాషలాడుతున్నారని కుమారస్వామి పోలీసుల ఎదుట వాపోయారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించి తన భూమిని ఇప్పించవల్సిందిగా పోలీసులకు విజ్ఞప్తి చేశాడు.