తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి - latest road accidents in kammam district

ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. ఖమ్మం జిల్లా వీఎం బంజరలో ఈ ప్రమాదం జరిగింది.

A man dead in road accident at vm banjara in kammam district
ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి

By

Published : May 29, 2020, 8:54 AM IST

ఖమ్మం జిల్లా పెనుబల్లి బీసీ కాలనీకి చెందిన సురేశ్​ తన ద్విచక్రవాహనంపై వీఎం బంజర వెళ్లి తిరిగి వస్తున్నారు. సత్తుపల్లి వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సురేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి రెండేళ్ల క్రితమే వివాహం కాగా ప్రస్తుతం అతని భార్య గర్భవతి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details