తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నడిరోడ్డుపై కాలి బూడిదైన కారు - నడిరోడ్డుపై కాలిపోయిన కారు

నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం సోన్​పేట్ వద్ద 44వ జాతీయ రహదారిపై ఓ కారు దగ్ధమైంది. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి డివైడర్​ను ఢీకొట్టిన ఘటనలో మంటలు వ్యాపించి అగ్నికి ఆహుతైంది.

నడిరోడ్డుపై కాలి బూడిదైన కారు
నడిరోడ్డుపై కాలి బూడిదైన కారు

By

Published : Nov 4, 2020, 8:00 PM IST

నిజామాబాద్​ జిల్లా మెండోరా మండలం సోన్​పేట్​ వద్ద ఓ కారు కాలిబూడిదైంది. నిర్మల్​ నుంచి హైదరాబాద్​ వెళ్తున్న కారు ఓ ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి డివైడర్​ను ఢీకొట్టింది. మంటలు అలుముకుని చూస్తుండగానే దగ్ధమైంది.

కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.

నడిరోడ్డుపై కాలి బూడిదైన కారు

ఇదీ చూడండి:ఊహించని ప్రమాదం... తప్పిన అపాయం

ABOUT THE AUTHOR

...view details