భూతగాదా విషయంలో ఓ రైతుపై ఎనిమిది మంది కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగ్విలో చోటు చేసుకుంది. హైదర్ అనే రైతు సాగుచేసుకుంటున్న భూమి తమదంటూ ఆదిలాబాద్‌కు చెందిన ఎనిమిది మంది ఘర్షణకు దిగారు. గాయాలపాలైన హైదర్‌ను గ్రామస్థులు హుటాహుటిన నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం హైదర్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
భూ తగాదాలో వ్యక్తిపై కత్తులతో 8మంది దాడి - CRIME UPDATES
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగ్విలో దారుణం చోటుచేసుకుంది. భూ తగాదాలో ఓ రైతుపై ఎనిమిది మంది కలిసి కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.
8 members Attacked on a farmer with swords