సంచలనం రేపిన హేమంత్ హత్య కేసులో మరో ఏడుగురు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చర్లపల్లి జైలు నుంచి ఏడుగురు నిందితులను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హేమంత్ హత్యకేసులో కస్టడీకి మరో ఏడుగురు నిందితులు
13:23 October 07
కస్టడీకి మరో ఏడుగురు నిందితులు
సెప్టెంబర్ 25వ తేదీన రాజధానిలో కలకలం సృష్టించిన పరువుహత్య కేసులో విచారణ కొనసాగుతోంది. చందానగర్‌కు చెందిన హేమంత్... తన ఇంటికి ఎదురుగా ఉండే అవంతిని ప్రేమించి జూన్ 10వ తేదీన వివాహం చేసుకున్నాడు. పెళ్లిని అంగీకరించని యువతి కుటుంబసభ్యులు కిరాతకంగా హేమంత్‌ను హత్య చేయించారు.
ఈ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరిపి... కేసులో ప్రమేయమున్న ప్రతి ఒక్కరినీ శిక్షిస్తామని సీపీ సజ్జనార్ హామీ ఇచ్చారు. ఇప్పటికే పలువురిని కస్టడీలోకి తీసుకుని విచారించారు.
ఇదీ చూడండి:భార్య కొట్టడం వల్లే మృతి చెందాడు!