తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గ్యాస్​సిలిండర్​ పేలి మూడు ఇళ్లు ధ్వంసం - రామచంద్రాపురం వార్తలు

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి మూడు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగకపోవటం వల్ల అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

3 houses damaged in gas blast in ramachandrapuram
3 houses damaged in gas blast in ramachandrapuram

By

Published : Nov 6, 2020, 9:31 AM IST

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన శంకర్ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇల్లు ధ్వంసమై... ఇంటి పై రేకులు పగిలిపోయాయి. పక్కనే ఉన్న ఇద్దరు సోదరుల ఇళ్లూ స్వల్పంగా ధ్వంసమయ్యాయి.

ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం సంభవించకపోవడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గ్యాస్ సిలిండర్​ను తనిఖీ చేసి ఇవ్వకపోవడం వల్లే ప్రమాదం సంభవించిందని బాధితులు ఆరోపించారు. రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: మద్యానికి బానిసై... ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details