తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రూ.2 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం - thandur news

కర్ణాటక నుంచి వికారాబాద్​ జిల్లా తాండూరుకు అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. కారులో తరలిస్తుండగా... తనిఖీలు చేసిన పోలీసులకు రూ.2 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

2 lakhs worth gutka caught by police in thandur
2 lakhs worth gutka caught by police in thandur

By

Published : Aug 11, 2020, 4:06 AM IST

వికారాబాద్ జిల్లా తాండూరులో రూ. 2 లక్షలు విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. సోమవారం రాత్రి ఇంతియాజ్​ అనే వ్యక్తి తన కారులో కర్ణాటక నుంచి గుట్కా ప్యాకెట్లను పట్టణానికి తీసుకువస్తుండగా పట్టుబడ్డాడు. నిందితుని నుంచి కారు, గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

పాత తాండూరుకు చెందిన ఎండీ ఇంతియాజ్ స్థానికంగా పాన్​షాప్​ నిర్వహిస్తున్నాడు. అతని దుకాణంతో పాటు పట్టణంలోని ఇతర ప్రాంతాల్లోని పాన్​షాప్​లు, కిరాణా దుకాణాలకు సైతం గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కర్ణాటక నుంచి గుట్యా ప్యాకెట్లు తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీచూడండి:ఐఐటీ విద్యార్థినికి మంత్రి కేటీఆర్ చేయూత

ABOUT THE AUTHOR

...view details