రోడ్డుపై ఆడుకుంటున్న బాలుడిని కారు ఢీకొట్టగా... మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో చోటుచేసుకుంది. జహీరాబాద్ రాంనగర్ కాలనీకి చెందిన 14 నెలల ఉమర్ ఫారూఖ్ ఇంటిముందు ఆడుకుంటుండగా... అటువైపు వేగంగా వచ్చిన కారు బాలున్ని ఢీకొని ఈడ్చుకెళ్లింది.
ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారిని చిదిమేసిన కారు... - జహీరాబాద్లో కారు ప్రమాదం
అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఆడుకుంటున్న పద్నాలుగు నెలల చిన్నారిని వేగంగా వచ్చిన కారు మింగేసింది. ఆ క్షణం వరకు వినిపించిన ఆ బుజ్జాయి బోసినవ్వులను ఆ డ్రైవర్ నిర్లక్ష్యం చిదిమేసింది. ఈ విషాదకర ఘటన... సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో జరిగింది.
ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారిని చిదిమేసిన కారు...
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని... చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. అప్పటి వరకు అడుకున్న చిన్నారి విగతజీవిగా మారటాన్ని చూసిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని... నిర్లక్ష్యంగా కారు నడిపిన డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.