తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వరద నీటిలో చిక్కుకుని 100 గేదెలు మృత్యువాత - chandrayangutta latest news

భారీ వర్షాలు హైదరాబాద్ నగరాన్ని అతలాకుతులం చేశాయి. వరద నీటితో లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి నీరు చేరి తీవ్ర ఆస్తి నష్టం మిగిల్చాయి. ఈ క్రమంలోనే చాంద్రాయణగుట్టు హాశమబాద్​లో వరద నీటిలో చిక్కుకుని సుమారు 100 గేదెలు మృతి చెందాయి.

100-buffaloes-were-trapped-in-the-floodwaters-and-died-in-oldcity-hyderabad
వరద నీటిలో చిక్కుకుని 100 గేదెలు మృత్యువాత

By

Published : Oct 16, 2020, 7:20 AM IST

Updated : Oct 16, 2020, 7:43 AM IST

హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్టలోని హాశమబాద్ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. వరద నీటిలో చిక్కుకుని దాదాపు 100 గేదెలు మృత్యువాతపడ్డాయి.

ఏం జరిగిందంటే..

గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు స్థానిక పల్లె చెరువుకు గండి పడింది. లోతట్టు ప్రాంతం అయినందున భారీగా వరద నీరు హాశమబాద్​లోరి చేరింది. ఫలితంగా ఆ ప్రాంతమంతా జలదిగ్బంధంలో చిక్కుకుంది. హాశమాబాద్​లో 3 గేదె దొడ్లు ఉండగా.. వాటిలో దాదాపు 100 గేదెలు ఉన్నాయి. వరద నీటితో దొడ్డు మునిగిపోవడం వల్ల గేదెలన్నీ మృత్యువాతపడ్డాయి. గురువారం నీటి ఉద్ధృతి కాస్త తగ్గడం వల్ల మృతి చెందిన గేదెలు బయటపడ్డాయి.

సమాచారం అందుకున్న వెటర్నరీ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని.. జేసీబీ సహాయంతో కళేబరాలను లారీల ద్వారా బయటకు పంపించారు. మరోవైపు గేదెల మృతితో తాము తీవ్రంగా నష్టపోయామని.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి: యజమాని కుమారుడి చేతిలో కిరాతకానికి గురైన బాలిక మృతి

Last Updated : Oct 16, 2020, 7:43 AM IST

ABOUT THE AUTHOR

...view details