తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్... మా జోలికొస్తే వదలం: ఇరాన్ - 'మా ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశిస్తే భారీ మూల్యం తప్పదు'

అమెరికా, ఇరాన్​ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశిస్తే భారీ మూల్యం తప్పదని హెచ్చరించింది ఇరాన్. గతవారం ఇరాన్ గస్తీ నౌకలతో అమెరికా ఓడలకు ఇబ్బందులు తలెత్తితే ఎదురుదాడికి దిగాలని పిలుపునిచ్చారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలకు సమాధానమిచ్చింది ఇరాన్.

iran
'మా ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశిస్తే భారీ మూల్యం తప్పదు'

By

Published : Apr 28, 2020, 2:03 PM IST

అమెరికా లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఇరాన్. అంతర్జాతీయ ప్రాదేశిక జలాల నియామవళిని అమెరికా గౌరవించాలని స్పష్టం చేసింది. అక్రమంగా దక్షిణ ఇరాన్ జలాల్లోకి ప్రవేశిస్తే భారీ మూల్యం తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. గల్ఫ్ ప్రాంతంలో సముద్ర జలాల వివాదాలకు కారణమవుతున్న కారణంగా పశ్చిమాసియాలో ఉన్న అమెరికా సేనలను వెనక్కి తీసుకోవాలని పేర్కొంది.

నియమాలు పాటించాల్సిందే..

అమెరికా, మిత్ర దేశాల నౌకలు అంతర్జాతీయ ప్రాదేశిక జలాల నియమావళిని పాటించాలని స్పష్టంచేసింది ఇరాన్. తమ దక్షిణ జలాల గుండా ప్రయాణించేటప్పుడు అంతర్జాతీయ సముద్ర జలాల నియమావళిని పాటించి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. అమెరికాకు చెందిన నౌకలు ఎలాంటి ఉద్రిక్తతలు, వివాదాలు సృష్టించకూడదని ఉద్ఘాటించింది. అనైతికంగా, రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తే భారీ మూల్యం తప్పదని హెచ్చరించింది.

దక్షిణ ఇరాన్ జలాల్లో అమెరికా ఓడలకు ఇరాన్ గస్తీ నౌకలతో సమస్యలు ఉత్పన్నమయితే వాటిపై ఎదురుదాడికి దిగాలని ప్రకటించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అయితే అధ్యక్షుడి వ్యాఖ్యలను తోసిపుచ్చారు ఇరాన్ సేనల కమాండర్ హోస్సైన్ సలామీ. అమెరికా నౌకలు ప్రమాదకరంగా ప్రవర్తిస్తే అంతేస్థాయిలో స్పందిస్తామని వెల్లడించారు.

ఇదీ చూడండి:'లాక్​డౌన్​ ముసుగులో యువతకు ఉగ్రమూకల ఎర'

ABOUT THE AUTHOR

...view details