గతేడాది జరిగిన యుద్ధాల్లో రికార్డు స్థాయిలో 12 వేల మంది చిన్నారులపై తీవ్ర ప్రభావం పడింది. వేలాది మంది మరణించగా.. మరికొందరు గాయపడ్డారు. చిన్నారులపై దాడులకు సంబంధించి.. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి నివేదిక రూపొదించింది.
చిన్నపిల్లలకు ప్రమాదకర దేశాల జాబితాలో అఫ్గానిస్థాన్, పాలస్తీనా, సిరియా, యెమన్ ముందున్నాయని ఐరాస నివేదిక స్పష్టం చేస్తుంది. ఇక్కడ నిత్యం తుపాకులు, బాంబుల మోతలు స్థానికులను కలచి వేస్తుంటాయి.
24 వేల దాడులు...
యుద్ధాల్లో చిన్నారులను ఉపయోగించుకోవడం, లైంగిక వేధింపులు, అపహరణలు, పాఠశాలలు, ఆసుపత్రుల్లో దాడులు ఇవన్నీ కలిపి ప్రపంచ వ్యాప్తంగా గతేడాది ఏకంగా 24 వేల దాడులు జరిగాయి.
చిన్నారులమీద జరుతున్న అకృత్యాలపై భద్రతా మండలికి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వార్షిక నివేదిక సమర్పించారు. సాయుధ దళాల దాడులు స్థిరంగానే ఉన్నప్పటికీ.. ప్రభుత్వ, అంతర్జాతీయ దళాల దాడులు మాత్రం ఇటీవలి కాలంలో భయంకరంగా పెరినట్లు తెలిపారు.
దాడులకు పాల్పడుతున్న దేశాలను 'ఐరాస' బ్లాక్ లిస్ట్‌లో ఉంచినా వారిలో ఎలాంటి మార్పూ కనిపించట్లేదు. చిన్నపిల్లలపై దాడులు.. మానవ హక్కుల సంఘాలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
ఇదీ చూడండి:క్రొయేషియా కార్చిచ్చు- వందలాది ఎకరాల అటవి దహనం