తెలంగాణ

telangana

ETV Bharat / international

వారికి ఒక్క డోసు టీకాతోనే రక్షణ! - pfizer vaccine

కరోనా నుంచి కోలుకున్నవారికి ఒక్క డోసు ఫైజర్​ టీకాతో రక్షణ కలుగుతుందని ఇజ్రాయెల్​ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఒక్క డోసుతోనే వారిలో బలమైన రోగ నిరోధక ప్రతిస్పందన ఉత్పన్నమైందని పేర్కొన్నారు.

israel research
కొవిడ్ నుంచి కోలుకున్నవారికి ఒక డోసు టీకాతోనే రక్షణ!

By

Published : Feb 17, 2021, 8:46 AM IST

కరోనా బారినపడి కోలుకున్న వారికి ఫైజర్​ బయోఎన్​టెక్ సంస్థలు ఉత్పత్తి చేసిన టీకా ఒకే డోసు సరిపోతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇలాంటివారిలో బలమైన రోగనిరోధక ప్రతిస్పందన వెలువడిందని పేర్కొంది. వారికి ఇన్ఫెక్షన్ ఎప్పుడు సోకింది, వారిలో గుర్తించదగ్గ స్థాయిలో యాంటీబాడీలు ఉన్నాయా అన్నదానితో సంబంధం లేకుండా ఈ స్పందన ఉందని తెలిపింది. ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కొవిడ్​ టీకాకు సంబంధించిన ప్రయోగాల డేటా సానుకూలంగానే ఉన్నప్పటికీ వాస్తవ ప్రపంచంలో వ్యాక్సిన్​కు సంబంధించి వెలువడుతున్న ఆధారాలు అస్పష్టంగా ఉన్నాయని అధ్యయనకర్తలు తెలిపారు.

ఇప్పటికే కొవిడ్​ బారినపడిన వారిపై ఈ టీకాలు ఎలా పనిచేస్తాయన్నది ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదని చెప్పారు. వాలంటీర్లలో 17 మంది 1-10 నెలల కిందట కొవిడ్​ బారినపడ్డారు. టీకా ఇవ్వడానికి ముందు వారిలోని యాంటీబాడీల స్థాయిని పరిశీలించారు. వారికి ఫైజర్-బయెఎన్​టెక్​లు రూపొందించిన బీఎన్​టీ162బి2 ఎంఆర్​ఎన్​ఏ టీకాను ఇచ్చారు. ఆ తర్వాత వారిలో యాంటీబాడీలను పరిశీలించారు. ఒక్క డోసుతోనే వారిలో బలమైన రోగ నిరోధక ప్రతిస్పందన ఉత్పన్నమైందని తేల్చారు. దీంతో కొవిడ్​ బారినపడి కోలుకున్నవారికి ఒక డోసు సరిపోతుందా అన్న చర్చకు తెరలేచిందని వారు చెప్పారు. ​

ఇదీ చదవండి :88.5 లక్షల మందికి టీకా పంపిణీ: కేంద్రం

ABOUT THE AUTHOR

...view details