తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రధాని వైదొలగాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు

ఇజ్రాయెల్​లో నిరసన జ్వాలలు హోరెత్తాయి. ఆ దేశ ప్రధాని బెంజిమన్​ నెతన్యాహు.. తన పదవి నుంచి దిగిపోవాలని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు అక్కడి ప్రజలు. అయితే.. తనపై వస్తున్నఅవినీతి ఆరోపణలను కొట్టిపారేసిన ప్రధాని.. ఇవన్నీ ఉద్దేశపూర్వక ఆందోళనలని పేర్కొన్నారు.

Protests against pm of Israel
ప్రధాని వైదొలగాలంటూ జెరూసలేంలో నిరసనలు

By

Published : Aug 30, 2020, 12:16 PM IST

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుకి వ్యతిరేకంగా జెరూసలేంలో నిరసనలు కొనసాగుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నెతన్యాహు.. ప్రధాని పదవి నుంచి వైదొలగాలని 11 వారాలుగా ఆందోళన చేపడుతున్నారు అక్కడి ప్రజలు. శనివారం ఆయన ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు.

ప్రధాని వైదొలగాలంటూ జెరూసలేంలో నిరసనలు

పదవి నుంచి దిగేందుకు ససేమిరా అంటున్న బెంజిమన్‌.. తనపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. ఈ ఆందోళనలన్నీ వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తులు చేస్తున్న ప్రేరేపిత నిరసనలుగా పేర్కొన్నారు.

అందుకే ఆగ్రహాం..

తొలిదశలో కరోనా కేసులను బాగానే కట్టడి చేసిన నెతన్యాహు సర్కార్.. అన్‌లాక్‌ తర్వాత విఫలమవడం ప్రజల నిరసనలకు కారణమైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌లో సుమారు లక్ష మంది వరకు మహమ్మారి బారినపడ్డారు. నిరుద్యోగం 20 శాతానికి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో నెతన్యాహుపై అవినీతి ఆరోపణలు కూడా రావడం వల్ల.. ప్రజలు ఆగ్రహంతో రోడ్లపైకి వస్తున్నారు.

నిరసనకారులు
జాతీయ జెండాలతో ఆందోళనల్లో ప్రజలు

ఇదీ చదవండి:1100ఏళ్ల నాటి బంగారు నాణేలు లభ్యం

ABOUT THE AUTHOR

...view details