ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / international

అకిరే పర్వతంపై కుర్దుల నౌరోజ్​ వేడుకలు అదిరే.. - అకిరే పర్వతం

ఇరాక్​లోని అకిరే పర్వతంపై వేలాది మంది కుర్ది ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సంప్రదాయ కుర్ది వేషధారణతో చేతుల్లో కాగడాలు పట్టి పర్వతంపైకి చేరుకున్నారు. బాణసంచా వెలుగుల నడుమ కొత్త ఏడాదికి స్వాగతం పలికారు.

అకిరే పర్వతంపై ప్రజలు
author img

By

Published : Mar 21, 2019, 4:48 PM IST

అకిరే పర్వతంపై నౌరోజ్ వేడుకలు
కుర్దుల నూతన సంవత్సరాది 'నౌరోజ్'ను​ ఇరాక్​లో కనుల పండువలా జరుపుకున్నారు. ఉత్తర ప్రాంతంలోని అకిరే పర్వతంపైకి వేలాది మంది కుర్దులు చేరుకున్నారు. సంప్రదాయ దుస్తులతో కాగడాలు చేతబట్టి పర్వతాన్ని అధిరోహించారు. పర్వతంపై ఏర్పాటు చేసిన కుర్దుల భారీ జాతీయ పతాకం వేడుకలకు మరింత శోభ తెచ్చింది.

ఏటా మార్చ్​ 21న 'నౌరోజ్'​ను జరుపుకుంటారు కుర్దులు. చీకటి యుగం అంతమై జీవితాల్లో వెలుగు మొదలుకు గుర్తుగా కొత్త ఏడాదిని నిర్వహిస్తారు ఇక్కడి ప్రజలు. అంతేకాకుండా ఈ రోజును స్వేచ్ఛ, స్వతంత్ర పాలనకు చిహ్నంగా కుర్దులు భావిస్తారు.

మధ్యప్రాచ్య దేశాల్లో సుమారు 3 కోట్ల మంది కుర్దులు జీవిస్తున్నారు. ఇరాన్, ఇరాక్​, టర్కీ, సిరియా దేశాల్లో వీరు నివసిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాక్​లోనే ఆనందంగా వేడుకలు చేసుకుంటున్నారు. ఇదే రోజున పర్షియన్ సంవత్సరాదిగా ఇరాన్​ ప్రజలు జరుపుకుంటారు.

ఇదీ చూడండి:టమోటాలతో హోలీ... ఎంతో బాగుంటుందో మరి

ABOUT THE AUTHOR

...view details