Motorcycle explosion: ఇరాక్‌లో ద్విచక్రవాహనం పేలిన ఘటనలో నలుగురు మరణించగా.. మరో నలుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఇరాక్‌లోని దక్షిణాది నగరమైన బస్రాలో ఈ పేలుడు సంభవించింది. దీంతో పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది.
తొలుత ఈ పేలుడును కారు బాంబుగా భావించారు. అయితే బస్రా గవర్నర్ అసద్ అల్ ఇదానీ మోటారుసైకిల్ పేలిందని విలేకరుల సమావేశంలో తెలిపారు. అనంతరం.. రెండు కార్లకు మంటలు వ్యాపించాయని పేర్కొన్నారు.