కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న భారత్, బ్రెజిల్ నుంచి ప్రయాణికుల రాకను నిషేధించాలని లెబనాన్ అధికారులు అక్కడి ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అయితే ఎంతకాలం ఈ నిషేధం ఉండాలో మాత్రం చెప్పలేదు. బ్రెజిల్లో పెద్దసంఖ్యలో లెబనాన్ జనాభా ఉంది. అలాగే లెబనాన్‌లో దక్షిణాసియా వలస కార్మికులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. నిషేధం అమలైతే వీరంతా ఇబ్బంది పడే అవకాశం ఉంది.
భారత్, బ్రెజిల్ ప్రయాణికులపై లెబనాన్ నిషేధం!
కరోనా విజృంభణ దృష్ట్యా.. భారత్, బ్రెజిల్ దేశాల నుంచి ప్రయాణికుల రాకను నిషేధించాలని లెబనాన్ అధికారులు అక్కడి ప్రభుత్వానికి ప్రతిపాదించారు.
లెబనాన్
కరోనా వ్యాప్తి తొలిదశలో లెబనాన్‌కు భారత్ చేయూతనిచ్చింది. ఆ దేశానికి ఉదారంగా వైద్య పరికరాలు పంపింది.
ఇదీ చదవండి :హోం ఐసోలేషన్ కొత్త మార్గదర్శకాలు ఇవే!