ఎన్నికైన 6 వారాల్లోనే పదవి కోల్పోయారు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు. నిర్ణీత గడువులోగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైనందున పార్లమెంటు రద్దయింది. 74-45 ఓట్ల తేడాతో అంగీకారం తెలిపిన సభ్యులు.. ఇదే ఏడాది సెప్టెంబర్ 17న మరోసారి ఎన్నికల జరపాలని నిర్ణయించారు.
ప్రధాని హోదా పొంది ప్రభుత్వ ఏర్పాటులో విఫలం కావడం ఆ దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఏప్రిల్ 9న జరిగిన ఎన్నికల్లో నెతన్యాహు విజయం సాధించారు. ఐదోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.