గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడి చేసింది. గాజాలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్... యుద్ధవిమానం పేల్చివేసింది. గాజా ప్రాంతంలోని హమాస్, దాని అనుబంధ సంస్థల స్థావరాలపై పదుల సంఖ్యలో బాంబులను విడిచింది ఇజ్రాయెల్ యుద్ధవిమానం.ఈ దాడుల్లో ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోగా... పలువురికి గాయాలయ్యాయని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది.
ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామని ఇజ్రాయెల్ చెబుతోంది.