పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇస్లాం నాయకులు వర్చువల్గా అత్యవసర సమావేశమయ్యారు. గాజాపై దాడులు ఆపాలని కోరారు.
గాజాలో ఇజ్రాయెల్ దాడులు ఆపేలా చూడాలని అంతర్జాతీయ సమాజాన్ని.. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ కోరారు. ఇజ్రాయెల్ వేర్పాటువాద దేశమని పాలస్తీనా విదేశాంగ మంత్రి రియాద్ మాలిక్ ఆరోపించారు. అది గాజా ప్రజలపై తీవ్రమైన దాడులు చేస్తోందని మండిపడ్డారు.