వాయువ్య ఇరాన్‌ను భూకంపం వణికించింది. ప్రకృతి విపత్తులో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. 300 మందికి పైగా గాయాలయ్యాయి. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. భూకంపం కారణంగా పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి.
తూర్పు అజెర్బైజాన్ ప్రావిన్స్‌లోని టేబ్రిజ్ నగరానికి 120 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని ఇరాన్ భూకంప కేంద్రం ప్రకటించింది. భూకంప తీవ్రతకు 40 ఇళ్లు ధ్వంసం కాగా, 200 పశువులు మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం 340 మంది గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
వర్నకేష్, వర్జాఘన్ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని ప్రొవిన్షియల్ గవర్నర్ మహమ్మద్ రెజా పౌర్బోహమ్మడి తెలిపారు. భూకంప ప్రభావానికి గురైన 41 గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయని వెల్లడించారు గవర్నర్.