Indian flights collision Dubai: దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్ సమయంలో రెండు విమానాలు ఢీకొనే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాయి. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలకు పెనుముప్పు తప్పినట్లైంది. ఆదివారం ఈ ఘటన జరిగింది.
ఏమైందంటే?
దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన ఈకే-524 విమానం ఆదివారం రాత్రి 9.45 గంటలకు టేకాఫ్ కావాల్సి ఉంది. దుబాయ్ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన ఈకే-568 విమానం ఐదు నిమిషాల తేడాతో బయల్దేరాల్సి ఉంది. అయితే, ఈ రెండు విమానాలు ఒకేసారి రన్‌వేపైకి వచ్చేశాయి.
plane collision on runway
'హైదరాబాద్ విమానం టేకాఫ్ కోసం '30ఆర్ రన్‌వే'పై వేగంగా దూసుకెళ్లింది. అదే సమయంలో ఎదురుగా మరో విమానం వేగంగా వస్తుండడాన్ని సిబ్బంది గమనించారు. దీంతో ఏటీసీ ద్వారా టేకాఫ్‌ను నిలిపివేయాలని పైలట్లకు సూచించాం. దీంతో హైదరాబాద్ విమానం నెమ్మదించింది. ట్యాక్సీవే మీదుగా పక్కకు వచ్చేసింది. బెంగళూరు విమానం రన్‌వే 30ఆర్ మీదుగా టేకాఫ్ అయింది. హైదరాబాద్ విమానం కొద్ది నిమిషాల విరామం తర్వాత బయల్దేరింది' అని ఈ ఘటన గురించి తెలిసిన అధికారులు వివరించారు.