తెలంగాణ

telangana

ETV Bharat / international

గాజా మరోమారు ఉద్రిక్తం- నలుగురు మృతి

పాలస్తీనా-ఇజ్రాయెల్​ సరిహద్దు మరోమారు రణరంగాన్ని తలపించింది. కంచె దాటేందుకు యత్నించిన పాలస్తీనావాసులపై ఇజ్రాయెల్​ సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గాయపడ్డారు. ఈజిప్ట్​ చొరవతో శాంతి చర్చలు మొదలవగా... నిరసనలు ఆగాయి.

గాజా మరోమారు ఉద్రిక్తం- నలుగురు మృతి

By

Published : Mar 31, 2019, 10:26 AM IST

Updated : Mar 31, 2019, 10:43 AM IST

గాజా మరోమారు ఉద్రిక్తం- నలుగురు మృతి
ఇజ్రాయెల్​కు వ్యతిరేకంగా పాలస్తీనా వాసుల ఆందోళన మరోమారు హింసాయుతమైంది. వేలాది మంది పాలస్తీనావాసులు శనివారం ఇజ్రాయెల్​ సరిహద్దు వద్ద నిరసనలు తెలిపారు. కొందరు సరిహద్దు కంచెను ధ్వంసం చేయడానికి ప్రయత్నించగా ఇజ్రాయెల్​ సైనికులు బాష్పవాయువు ప్రయోగించారు. అప్పటికీ పరిస్థితి సద్దుమణగకపోవడం వల్ల నిరసనకారులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో 316 మంది గాయపడ్డారు.

ఏడాది పూర్తయిందని...

గాజాను ఈజిప్ట్​-ఇజ్రాయెల్​ దిగ్బంధించడం సహా అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలెంకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ గతేడాది మార్చి 30న పాలస్తీనావాసులు నిరసనలు ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి వారాంతంలో సరిహద్దు వద్ద ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. మేలో ఈ నిరసనలు హింసాయుతమై 60మంది ప్రాణాలు కోల్పోయారు.

వారాంతపు నిరసనలు ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా శనివారం ఆందోళనను తీవ్రంతరం చేశారు. సరిహ్దదు వెంట వేర్వేరు ప్రాంతాలకు దాదాపు 40వేల మంది పాలస్తీనావాసులు చేరుకుని, నిరసనకు దిగారు.

శాంతి శాంతి...

తాజా ఆందోళనలు మరోమారు భారీ ప్రాణనష్టానికి దారితీస్తాయని అంతా భయపడ్డారు. అయితే... ఈజిప్ట్​ చొరవచూపి పాలస్తీనా, ఇజ్రాయెల్​తో చర్చలు జరిపింది. ఆందోళనకారులు సరిహద్దు వద్దకు వెళ్లకుండా ఆపేందుకు పాలస్తీనాను ఒప్పించింది. ఫలితంగా... నిరసనలు ఆగాయి.

రాకెట్లతో దాడి...

నిరసనలు ఆగిన కాసేపటికే ఐదు రాకెట్లతో ఇజ్రాయెల్​పై శనివారం రాత్రి పాలస్తీనా దాడి చేసింది. ఇజ్రాయెల్​ సైనికులు దీటుగా స్పందించారు. యుద్ధట్యాంకులతో గాజాలోని సైనిక స్థావరాలపై ప్రతిదాడి చేశారు.

ఇదీ చూడండి:వెలుగుల భవిష్యత్​ కోసం 'ఎర్త్​ అవర్​'

Last Updated : Mar 31, 2019, 10:43 AM IST

ABOUT THE AUTHOR

...view details