రంజాన్ పండగ వేళ.. సిరియాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అజాజ్ పట్టణంలోని మసీదు వద్ద కారు బాంబు పేలుడు జరిపి ఘాతుకానికి ఒడిగట్టారు టర్కీ అనుకూల ఉగ్రవాదులు. ఈ ఘటనలో 17 మంది మరణించారు. మరో 20 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల్లో నలుగురు చిన్నారులున్నారు.
పట్టణ ప్రధాన కేంద్రంలోని మసీదులో ఇఫ్తార్ విందు ముగించుకొని బయటికొస్తున్న ప్రజలే లక్ష్యంగా దాడికి యత్నించారు ముష్కరులు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.