తెలంగాణ

telangana

ETV Bharat / international

పేలిన ఆయిల్​ ట్యాంకర్- ​తప్పిన ప్రాణనష్టం

సిరియాలో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాష్ట్ర ఇంధన పంపిణీ సంస్థ వెలుపల ఆయిల్‌ ట్యాంకర్‌ పేలటంతో ఆ ప్రాంతమంతా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడినట్లు స్థానిక మీడియా తెలిపింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది.

An explosion Tuesday in an oil tanker outside a state fuel distribution company in central Syria caused a massive fire, state media reported.
ఆయిల్​ ట్యాంకర్​ పేలి భారీగా మంటలు - తప్పిన ప్రాణనష్టం

By

Published : Jan 20, 2021, 11:35 AM IST

మధ్య సిరియాలోని రాష్ట్ర ఇంధన పంపిణీ సంస్థ వెలుపల భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ఆయిల్‌ ట్యాంకర్‌ పేలటంతో ఆ ప్రాంతమంతా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. అగ్నికీలలకు దట్టమైన పొగ వ్యాప్తి చెందింది. భారీగా చెలరేగిన మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ఆ దేశ అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు.

ఘటనపై స్పందించిన చమురుశాఖ మంత్రి ఏడు ట్యాంకర్లకు ఈ మంటలు వ్యాప్తి చెందాయన్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు.

ట్యాంకర్‌ నుంచి ముడి చమురు తీస్తున్నప్పుడు ఈ పేలుడు జరిగిందని తెలిపారు.

ఆయిల్​ ట్యాంకర్​ పేలి చెలరేగిన మంటలు

ఇదీ చదవండి :ఇథియోపియాలో హింస.. 80మంది మృతి

ABOUT THE AUTHOR

...view details