టర్కీలోని వాయువ్య ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 97మందికి గాయాలయ్యాయి. ఈ ఫ్యాక్టరీలో 186మంది పనిచేస్తున్నారని సమాచారం. ఘటనకు గల కారణాలపై విశ్లేషిస్తున్నారు.
'ఒకరి పరిస్థితే విషమం'
ఘటనా స్థలానికి చేరుకున్న టర్కీ ఆరోగ్యమంత్రి కోకా.. పరిస్థితిపై ఆరా తీశారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి మాత్రమే విషమంగా ఉందని.. మిగతా వారు క్షేమంగానే ఉన్నట్లు చెప్పారు. సహాయ చర్యల కోసం ఓ విమానం, రెండు హెలికాఫ్టర్లను పంపారు.
ఇదీ చూడండి:కరోనా బాధితుల పర్యవేక్షణకు బుల్లి పరికరం