తెలంగాణ

telangana

ETV Bharat / international

50 దేశాలకు పాకిన మంకీపాక్స్‌.. డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ ఏమన్నారంటే.? - మంకీపాక్స్ పై స్పందించిన డబ్యూహెచ్​వో

WHO on Monkeypox: ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మంకీపాక్స్‌ వ్యాప్తిని ప్రస్తుతానికి అంతర్జాతీయ అత్యయిక స్థితిగా ప్రకటించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్ణయించింది. అయితే, రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాపిస్తున్న ఈ వ్యాధి 50 దేశాలకు వ్యాపించడం ఆందోళనకర అంశమేనని స్పష్టం చేసింది.

WHO on Monkeypox
WHO on Monkeypox

By

Published : Jun 28, 2022, 2:07 AM IST

Updated : Jun 28, 2022, 3:07 AM IST

WHO on Monkeypox: కరోనా తర్వాత ప్రపంచాన్ని భయపెడుతోన్న మరో వైరస్‌ మంకీపాక్స్‌. పశ్చిమ ఆఫ్రికాలో మొదలైన ఈ వైరస్‌ ఇప్పటికే అనేక దేశాలకు పాకింది. ఈనేపథ్యంలోనే ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మంకీపాక్స్‌ వ్యాప్తిని ప్రస్తుతానికి అంతర్జాతీయ అత్యయిక స్థితిగా ప్రకటించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్ణయించింది. అయితే, రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాపిస్తున్న ఈ వ్యాధి 50 దేశాలకు వ్యాపించడం ఆందోళనకర అంశమేనని స్పష్టం చేసింది. మంకీపాక్స్‌ ప్రాబల్యం, పొంచివున్న ముప్పుతోపాటు పేరు మార్పుపై చర్చించేందుకు అంతర్జాతీయ నిపుణులు, భాగస్వామ్య పక్షాలతో సమావేశమైన సందర్భంగా డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ ఈ విధంగా మాట్లాడారు.

Monkeypox News: ‘మంకీపాక్స్‌ ఇప్పటికే 50 దేశాలకు వ్యాపించింది. ఆస్ట్రేలియాలో 13 కేసులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 4100 కేసులు వెలుగు చూశాయి. బయటపడని కేసుల సంఖ్య భారీగానే ఉండవచ్చు. ఈ వ్యాధి వల్ల పొంచివున్న ముప్పుపై తీవ్ర ఆందోళన చెందుతున్నాం’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతానికి దీన్ని అంతర్జాతీయ అత్యయిక స్థితిగా ప్రకటించవద్దని నిర్ణయించామని.. కానీ, రానున్న రోజుల్లో ఈ పరిస్థితి మారే ప్రమాదం ఉందన్నారు.

Monkeypox latest update: ఇదిలా ఉంటే, ఈ వ్యాధిపై ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో.. మంకీపాక్స్‌ అనే పేరుతో పిలవడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఒక ప్రాంతంపై వివక్షత చూపించేలా ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మంకీపాక్స్‌కు కొత్త పేరును నిర్ణయించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది.

ఇవీ చదవండి:

Last Updated : Jun 28, 2022, 3:07 AM IST

ABOUT THE AUTHOR

...view details