UK PM Johnson: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అవిశ్వాస పరీక్షలో నెగ్గారు. సోమవారం జరిగిన ఓటింగ్‌లో మెజరిటీ కన్జర్వేటివ్ పార్టీ నేతలు ఆయనకు మద్దతుగా నిలిచారు. 211 ఓట్లు అనుకూలంగా రావడం వల్ల అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఒక్క ఓటు తేడాతో అయినా బోరిడ్ ఓడిపోతారని భావించిన ప్రతిపక్షాలకు నిరాశే మిగిలింది. అయితే ఓటింగ్ రోజు హైడ్రామా నడిచింది. పార్టీ గేట్ వ్యవహారంలో ఆరోపణలు వచ్చినప్పటికీ తనపై నమ్మకం ఉంచాలని, అనుకూలంగా ఓటు వేయాలని సొంత పార్టీ నేతలను బోరిస్ వేడుకున్నారు.
Boris Johnson confidence vote: సీక్రెట్ బ్యాలెట్ ద్వారా నిర్వహించిన ఓటింగ్‌లో విశ్వాస పరీక్షలో నెగ్గాలంటే బోరిస్‌కు 180 మంది సొంత పార్టీ నేతల మద్దతు అవసరం కాగా.. 211 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన ఊపిరిపీల్చుకున్నారు. ప్రతినిధుల సభలో మొత్తం సభ్యుల సంఖ్య 650 కాగా, అధికార కన్జర్వేటివ్ పార్టీకి 359 మంది బలం ఉంది. అయితే బోరిస్‌ను పదవి నుంచి తప్పించడానికి సొంత పార్టీలో 180 మంది సభ్యుల బలం అవసరం. కానీ బోరిస్‌కు అనుకూలంగా 211 ఓట్లు వచ్చాయి. అవిశ్వాసంలో జాన్సన్ విజయం సాధించినందు వల్ల కన్జర్వేటివ్ పార్టీ నిబంధనల ప్రకారం మరో ఏడాది పాటు ఆయనపై అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి వీల్లేదు.